త్వరలో 4 లక్షల ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులను ఊరిస్తున్న కేంద్రం
- December 21, 2017
దేశంలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సీనియర్లు పదవీ విరమణ చేయడం, కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలి వేయడంతో భారీ మొత్తంలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. 2016 మార్చి 1 వరకు ఇచ్చిన వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4, 12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. నిరుద్యోగులకు ఆశా కిరణంలా కనిపించే ఈ వార్త వీలైనంత త్వరగా ఆచరణ సాధ్యం కావాలని వారు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల