త్వరలో 4 లక్షల ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులను ఊరిస్తున్న కేంద్రం

- December 21, 2017 , by Maagulf
త్వరలో 4 లక్షల ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగులను ఊరిస్తున్న కేంద్రం

దేశంలోని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సీనియర్లు పదవీ విరమణ చేయడం, కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలి వేయడంతో భారీ మొత్తంలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు అందించిన నివేదికలో పేర్కొన్నారు. 2016 మార్చి 1 వరకు ఇచ్చిన వార్షిక నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4, 12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. నిరుద్యోగులకు ఆశా కిరణంలా కనిపించే ఈ వార్త వీలైనంత త్వరగా ఆచరణ సాధ్యం కావాలని వారు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com