విధి నిర్వహణలో 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్ మృతి
- December 21, 2017
యూఏఈ: రస్ అల్ ఖైమాకి చెందిన 45 ఏళ్ళ ఫైర్ ఫైటర్, విధి నిర్వహణలో తీవ్ర గాయాల పాలై, ప్రాణాలు కోల్పోయారు. నాన్ కమిషనల్ ఆఫీసర్ అహ్మద్ అబ్దుల్లా ఇబ్రహీమ్ అల్ మలికి, అల్ ఘాయిల్ ఏరియాలోని సివిల్ డిఫెన్స్ సెంటర్‌లో డ్యూటీ చేస్తుండగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పెద్ద ఐరన్ గేట్‌ని తెరిచేందుకు అహ్మద్ అబ్దుల్లా ప్రయత్నించగా, అది ఆయన మీద పడ్డంతో ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్సనందించి ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స అందించిన కాస్సేపటికే ప్రాణాలు కోల్పోయారు అహ్మద్ అబ్దుల్లా. తన సోదరుడ్ని కోల్పోవడం చాలా బాధగా ఉందని అబ్దుల్లా సోదరుడు చెప్పారు. రస్ అల్ ఖైమా సిటీ, మామురా ఏరియాలోని దివాన్ మాస్క్‌లో అబ్దుల్లా ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. ఆ తర్వాత హుదైబా సిమిటెరీలో అబ్దుల్లా పార్తీవదేహాన్ని ఖననం చేస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల