మహేష్ కు స్పైడర్ ఎఫెక్ట్ ఇంకా వదల్లేదు

- December 21, 2017 , by Maagulf
మహేష్ కు స్పైడర్ ఎఫెక్ట్ ఇంకా వదల్లేదు

ఈ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ. సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో ఇదే జరుగుతోంది. అసలే పోయిన సంవత్సరం బ్రహ్మోత్సవం విషయంలో దారుణంగా దెబ్బతిని సినిమాకు రేమునరేషన్ ని వదులుకున్న మహేష్ బాబు , ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చేసిన స్పైడర్ సినిమా కూడా బెడిసి కొట్టింది. సోషల్ మీడియా లో అతని అభిమానులు , యాంటి ఫ్యాన్స్ నుంచి కూడా విపరీతంగా ట్రోల్స్ ఇంకా ఎదుర్కొంటూ ఉండగా, దానికి తోడు కొత్తగా మళ్ళీ స్పైడర్ సినిమా దెబ్బ ఇంకో సారీ తగిలింది.

ఎలాగో అలా స్పైడర్ సినిమా ని మరిచిపోదామని ప్రయత్నిస్తున్న మహేష్ బాబు , తెలియక చేసిన ఒకే ఒక పని కారణంగా మళ్ళీ దొరికిపోయాడు. కొన్ని గంటల క్రిందట ఒక శీతల పానీయానికి సంబందించి తను నటించిన యాడ్ ఒక దాన్ని తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసాడు. ఇదే యాడ్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా విదేశాల్లో కి వెళ్లి మరీ షూట్ చేసారు. యాడ్ చూస్తే, బానే ఉంది , అందులో మహేష్ కూడా అదుర్స్ అనే చెప్పాలి. కాని ఈ యాడ్ కి ఈ మధ్యనే రిలీజ్ అయిన సినిమా స్పైడర్ కి అందరూ ముడిపెడతారని మహేష్ బాబు ఊహించలేకపోయాడు.

తను నటించిన స్పైడర్ సినిమా కన్నా ఈ యాడ్ చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రెండున్నర గంటల పాటు ఆ సినిమా టార్చర్ ని భరించడం కంటే హాయిగా ఈ రెండూ నిమిషాల యాడ్ ని చూడటం మంచిది అంటూ గోల మొదలెట్టేసారు.

తానే, స్వయంగా మురుగుదాస్ ని పిలిపించుకుని కథ విని ఒకే చేసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో మహేష్ బాబు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తన కుటుంబంతో పాటు ఫారిన్ కి వెళ్ళిపోయాడు.

కాని , స్పైడర్ సినిమాని అందరూ తన లానే మరిచిపోతారని అనుకోగా , ఊహించని విధంగా ఇంకా అందరూ ఆ సినిమాని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. ఈ అడవర్స్మెంట్ కి ' టేక్ చార్జ్' అని కాప్షన్ పెట్టగా , నెటిజన్లు ఏకంగా కమాన్ మహేష్ టేక్ చార్జ్ అంటూ కామెడీ గా ట్రోల్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com