త్వరలో అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలు
- December 21, 2017తమ దేశంలో పౌరఅణువిద్యుత్ తయారీలో అమెరికా సంస్థల భాగస్వామ్యంపై త్వరలోనే చర్చలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. అన్నీ సజావుగా జరిగితే 2018 ఆరంభంలోనే అణువిద్యుత్ తయారీకోసం తొలి టెండర్‌ను జారీ చేస్తామని సౌదీ విద్యుత్ శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలి ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అణు విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇంథన చమురువృధాను అరికట్టి ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశం వుంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా దేశవ్యాప్తంగా అణువిద్యుత్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు అమెరికన్ సంస్థలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఈ క్రమం వేగం పుంజుకుంటాయని తాము భావిస్తున్నామని, అమెరికా చట్ట నిబంధనల మేరకు ఆయా సంస్థలు తమ దేశంలో అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించగలదని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. అణుకార్యక్రమాలను శాంతియుత ప్రయోజనాలకు తప్ప ఆయుధ ఉత్పాదనకు వినియోగించరాదంటూ తమతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపే దేశాలకు అమెరికా షరతులు విధించే విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?