కొత్త వ్యవస్థలో సౌదీ జనాభాలో సగం మందికి సంక్షేమ ఫలాలు
- December 22, 2017
దుబాయ్ : సౌదీ అరేబియా గురువారం 2 బిలియన్ సౌదీ రియళ్ళు ( 533 మిలియన్ డాలర్లు) మంజూరు చేసింది, తక్కువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన కుటుంబాల కోసం కొత్త సంక్షేమ వ్యవస్థలో మొట్టమొదటి నెలవారీ విడతలో కింగ్డమ్ జనాభాలో సగం మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ చెల్లింపులలో ఆహార పదార్ధాలు, సేవల వంటి అనేక వస్తువులపై 5 శాతం విలువ ఆధారిత పన్ను, అదేవిధంగా వచ్చే ఏడాది విద్యుత్ మరియు గ్యాసోలిన్ ధరలను పెంచి సబ్సిడీ లలో కోతలు విధించనున్నారు.కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి మంత్రి అలీ అల్-ఘఫీస్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, బ్యాంకు బదిలీల నుంచి దాదాపుగా 3 మిలియన్ల కుటుంబాలకు అందచేసినట్లు తెలిపారు. ఇవి మొత్తం10.6 మిలియన్ల మంది లబ్ధిదారులకు చేరుకున్నాయి. అతను ఆ కుటుంబాలలో సగం మందికి కనీసం 938 సౌదీ రియళ్ళు (250 డాలర్లు ) గరిష్ట చెల్లింపుగాఉందని ఆయన అన్నారు. అలాగే కనీస చెల్లింపుga 300 సౌదీ రియళ్ళు ( 80 డాలర్లు) .ఈ రాబోయే ఆర్ధిక సంవత్సరం కనీసం 978 బిలియన్ సౌదీ రియళ్ళు ( 261 బిలియన్ డాలర్లు ) ఖర్చు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాజ్య చరిత్రలో అతిపెద్ద బడ్జెట్ ను ప్రభుత్వం ప్రకటించిన రెండు రోజుల తరువాత చెల్లింపులు వస్తాయి. ప్రభుత్వం ఇప్పటికే పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఇంధన పానీయాలపై ఈ ఏడాది పన్నులను , అదేవిధంగా విలాస వస్తువులపై భారీ పన్నును ప్రవేశపెట్టింది. 2018 నాటికి సిటిజన్స్ ఖాతా చెల్లింపులపై దాదాపుగా 32 బిలియన్ సౌదీ రియళ్ళు (8.5 బిలియన్ డాలర్లు) చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







