కాకినాడ తీరాన్ని హోరెత్తించిన ఏఆర్‌ మ్యూజికల్ నైట్..

- December 22, 2017 , by Maagulf
కాకినాడ తీరాన్ని హోరెత్తించిన  ఏఆర్‌ మ్యూజికల్ నైట్..

కాకినాడ తీరం సంగీత ఝరిలో ఓలలలాడింది. చివరి రోజు బీచ్‌ ఫెస్టివల్‌లో ఏ ఆర్‌ రెహమాన్‌ మ్యూజికల్‌ షో అదుర్స్‌ అనిపించింది. రెహమాన్‌ పాటలకు యూత్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్సర్లు  చేసిన ఫెర్ఫ్మామెన్స్ ఇరగదీశారు. చివరి రోజు కార్యక్రమానికి మంత్రులు చినరాజప్ప, యనమల, అయ్యన్నపాత్రడుతో పాటు జిల్లా రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. షో తర్వాత రెహమాన్‌ను ఏపీ ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించారు. తెలుగింటి సంస్కృతి, సంప్రదాయాలకు బీచ్ ఫెస్టివల్ అద్దం పట్టింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మత్స్యశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రకాల చేపల ఎక్వేరియం మరో ఆకర్షణగా నిలిచింది. అలాగే పర్యాటకులను ఆకట్టుకునేందుకు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన  హెలికాప్టర్‌, పారా చ్యూట్ , స్పీడ్ బోట్ రైడింగ్ కు చిన్నా పెద్దా అంతా ఆసక్తి చూపారు. ఆకాశంలో విహరిస్తూ.. కాకినాడ అందాలను ఎంజాయ్ చేశారు.  అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫల, పూల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com