ఈ వారాంతంలో క్రిస్మస్ ఆరాధనలకు సిద్ధమైన చర్చిలు

- December 22, 2017 , by Maagulf
ఈ వారాంతంలో క్రిస్మస్ ఆరాధనలకు సిద్ధమైన చర్చిలు

దుబాయ్:శీతాకాలంలో వచ్చే క్రిస్మస్ పండుగ క్రైస్తవ భక్తుల హృదయానికి  క్రీస్తు ప్రేమ సందేశం వెచ్చదనాన్ని తీసుకువస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా అనందంగా, ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే క్రిస్మస్ ను పురస్కరించుకొని యూఏఈలో పలు చర్చిలలో ప్రత్యేకమైన ఆరాధనలతో ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరు 24 వ తేదీ నుంచి ప్రారంభమైయ్యే క్రిస్మస్ ఆరాధన గీతాలు (కారోల్స్) మరియు ప్రత్యేక సమావేశాలలో పాటలను మధురంగా పడుతున్నారు. అర్ధరాత్రి జరిగే క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా ఉంటాయి నగరం అంతటా, అనేకమంది ప్రజానీకం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రిస్మస్ ఆరాధన గీతాలతో డిసెంబరు 24 మరియు 25 వ తేదీలలో రెండు అత్యంత ముఖ్యమైన తేదీలలో క్రిస్టియన్ ఆరాధకులకు స్థానం కల్పించడం జరిగింది. చిన్నారులు ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకుంటారు. ముఖ్యంగా మలయాళ కుటుంబాలలో ఇళ్లను ఫ్యాన్సీ క్రిస్మస్ ట్రీలతో అలంకరిస్తారు. ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ గీతాలు వినిపిస్తుంటాయి. పండుగకు వచ్చిన అతిథులకు ఇంట్లో తయారుచేసిన వైన్‌ను అందిస్తారు. అలాగే ఈ పండుగ సందర్భంగా కర్ర పెండలంతో బిర్యానీ చేసి వడ్డిస్తారు. అలాగే మటన్, చికెన్ కూరలు, అప్పాలు, రోజ్ కుకీస్ వంటి పిండి వంటలు తయారుచేసుకుంటారు. "దేవుని కుమారుని జననం కారణంగా క్రిస్మస్ ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన పర్వదినంగా ఉంది. క్రిస్మస్ సందేశాన్ని మానవాళి రక్షకుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చిన శుభ సందర్భం అని  ఫాదర్  లెన్నియే  జె  .ఏ . డబ్లిన్లో సెయింట్ మేరీ కాథలిక్ చర్చ్ లోని  పారిష్ పూజారి కన్నూలీ అన్నారు. ఆయన  మా గల్ఫ్ డాట్ కామ్ తో మాట్లాడుతూ, డిసెంబరు 24 వ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి క్రిస్మస్ రోజులు అన్నిటిలో క్రిస్మస్ ప్రార్ధనను నిర్వహిస్తారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ మరియు అరబిక్ లో సాయంత్రం  5 గంటల వరకు జరుగుతాయి  వద్ద ఆ తరువాత 24 వ తేదీ అర్ధరాత్రి 11.15 గంటలకు కరోల్ గానం చేయబడుతుంది. అర్ధరాత్రి గంభీరమైన క్రిస్మస్ ప్రత్యేక సందేశం ఇవ్వబడుతుంది. ఈ సందేశం కోసం పదుల సంఖ్యలో హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com