కొత్త ట్యాక్స్‌ 2018 ప్రారంభంలోనే

- December 22, 2017 , by Maagulf
కొత్త ట్యాక్స్‌ 2018 ప్రారంభంలోనే

మనామా: కొత్త ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ 2018 ఆరంభంలోనే అమల్లోకి రావొచ్చని మినిస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. టొబాకో, ఎనర్జీ డ్రింక్స్‌పై 100 శాతం, సాఫ్ట్‌ డ్రింక్స్‌పై 50 శాతం ట్యాక్స్‌ విధిస్తూ కొత్త ట్యాక్స్‌ విధానాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసినదే. జిసిసి సుప్రీమ్‌ కౌన్సిల్‌ రిజల్యూషన్‌ (36వ సెషన్‌ రియాద్‌లో 2015లో) ఆధారంగా ఈ ట్యాక్స్‌ విధానానికి రూపకల్పన జరిగింది. 2016 నవంబర్‌లో ఈ మేరకు సభ్య దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. సభ్య దేశాల్లో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఆ ఆరోగ్యానికి అశనిపాతంగా మారే వివిధ రకాలైన ఉత్పత్తుల వినియోగం తగ్గించే దిశగా ఆయా ప్రమాదకర వస్తువులు, పదార్థాలపై అధిక ట్యాక్స్‌ వసూలు చేయడం జరుగుతుంది. తద్వారా వచ్చే రెవెన్యూస్‌ ఖజానాకి కొత్త ఉత్సాహాన్ని కూడా ఇవ్వనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com