దుబాయ్‌ ఫ్రేమ్‌: వచ్చేవారం నుంచి సందర్శకులకు అనుమతిః

- December 22, 2017 , by Maagulf
దుబాయ్‌ ఫ్రేమ్‌: వచ్చేవారం నుంచి సందర్శకులకు అనుమతిః

దుబాయ్:ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న దుబాయ్‌ ఫ్రేమ్‌ సందర్శనకు రంగం సిద్ధమవుతోంది. వచ్చేవారం నుంచి సందర్శకులకు దుబాయ్‌ ఫ్రేమ్‌ని సందర్శించే అవకాశం కలగనుంది. దుబాయ్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ ఇంజనీర్‌ హుస్సేన్‌ లూటా మాట్లాడుతూ, దుబాయ్‌ ఫ్రేమ్‌ అధికారిక ప్రారంభోత్సవం వచ్చే వారంలో జరగనున్నట్లు చెప్పారు. దుబాయ్‌ ఫ్రేమ్‌ వద్దకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజల్ని నిర్దేశిత సమయంలో సందర్శనకు అనుమతిస్తారు. ఈ సందర్శనకు ముందుగానే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం యాప్‌నీ, అలాగే వెబ్‌సైట్‌నీ త్వరలో లాంఛ్‌ చేయబోతున్నారు. ఎటిసలాట్‌తో కలిసి వెబ్‌సైట్‌ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు. 160 మిలియన్‌ దిర్హామ్‌లతో నిర్మించిన దుబాయ్‌ ఫ్రేమ్‌ ప్రాజెక్ట్‌, సందర్శకులకు 360 డిగ్రీల కోణంలో దుబాయ్‌ని చూసే అవకాశం కల్పిస్తుంది. 150 మీటర్ల ఎత్తయిన రెండు టవర్స్‌, పాస్ట్‌ మరియు ప్రెజెంట్‌ దుబాయ్‌ని కనెక్ట్‌ చేయనుంది. ఈ సందర్శన కోసం పెద్దల నుంచి 50 దిర్హామ్‌లు వసూలు చేయనుండగా, పిల్లలకు 30 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. మూడేళ్ళ లోపు చిన్నారులకు, 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధులకు ప్రవేశం ఉచితం. పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌కి కూడా ఉచిత ప్రవేశమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com