కనిష్ఠానికి చేరిన బంగారం ధర
- November 18, 2015
మంగళవారం నాలుగు నెలల కనిష్ఠానికి చేరిన బంగారం ధర ఈ రోజు మరింత తగ్గింది. రూ.75 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.25,625కు చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర మరింత దిగివచ్చిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో సైతం ఔన్సు బంగారం ధర 1,064.55 అమెరికన్ డాలర్లుగా ఉండగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో 1,069.80 అమెరికన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ రోజు వెండి ధరలో ఎలాంటి మార్పులూ లేకుండా మంగళవారం నాటి ధరే స్థిరంగా ఉంది. దీంతో కేజీ వెండి ధర రూ.34,100గా నమోదయ్యింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







