ఫోర్జరీ కేసులో నిందితునికి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష

ఫోర్జరీ కేసులో నిందితునికి నాలుగు సంవత్సరాల జైలుశిక్ష

కువైట్ : ఒక కేసుకి సంబంధించిన పత్రాలలో తన కవల సోదరుని గుర్తింపు పత్రాన్ని ఉపయోగించి అనుమానితుడు  కేసు నుంచి తప్పుకోవాలని ప్రయత్నించిన నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఫోర్జరీ నేరానికి గాను ఆ పౌరుడికి  నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తప్పుడు ఐ డి ని ఉపయోగించి అరెస్ట్ నుంచి అతి తెలివిగా తప్పించుకోవాలనే ఎత్తుగడను డిటెక్టివ్ లు చేధించారు. అనుమానితుడు తనిఖీ కేంద్రంలో జరగబోయిన పరీక్షలో వరుసలో ముందుకు వెళ్లకుండా నిలిచి తచ్చట్లాడుతున్నాడు. ఆ పౌరుని వాలకం పసిగట్టిన డిటెక్టివ్ లు నిందితుని వేలిముద్రలను సరిపోల్చి గుర్తించటానికి ప్రయత్నించినప్పుడు నిందితుని గుట్టు రట్టయింది. తన కవల సోదరుని గుర్తింపత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది. 

 

Back to Top