జయలలిత మృతి కేసులో శశికళ, అపోలో ప్రతాప్‌రెడ్డికి సమన్లు జారీ
- December 22, 2017
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో భాగంగా శశికళ, అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది. 15 రోజుల్లోగా స్వయంగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు పంపింది. తీవ్ర అనారోగ్యంతో జయలలిత గతేడాది సెప్టెంబరు 22న చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొంది.. డిసెంబరు 5న కన్ను మూశారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో శశికళ కుటుంబ సభ్యులు మినహా ముఖ్యనేతలెవరినీ అనుమతించలేదు. అప్పట్లో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విచారణకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిషన్‌ను నియమించింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎలాంటి ఫొటోలు, దృశ్యాలు బయటకు రాలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఒకరోజు ముందు దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెట్రివేల్.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటి దృశ్యాలు విడుదుల చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల