జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ ఆఫర్.!
- December 22, 2017
కొత్త సంవత్సరం కానుకగా డిస్కౌంట్ ఆఫర్లతో ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ప్రైవేట్ క్యారియర్ జెట్ ఎయిర్వేస్, న్యూఇయర్ సేల్ స్కీమ్‌ను నేడు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఎకానమీలో బేస్ ఫేర్స్‌కు 10 శాతం డిస్కౌంట్, దేశీయ సెక్టార్లో బిజినెస్ క్లాస్ టిక్కెట్లకు 15 శాతం డిస్కౌంట్లను జెట్ ఎయిర్వేస్ ఆఫర్ చేస్తోంది.
డిసెంబర్ 13 నుంచి జనవరి 2 వరకు 11 రోజుల పాటు ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ కాలం 2018 జనవరి 15 నుంచి ప్రారంభమవుతుందని జెట్ ఎయిర్వేస్ శుక్రవారం ప్రకటించింది. 44 దేశీయ నెట్వర్క్ సర్వీసులకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది. వన్-వే ఎకానమీ టిక్కెట్ రూ.1,001 నుంచి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల