అంతరిక్షంలో తొలిసారి కాలిడిన వ్యక్తి ఇక లేరు..
- December 23, 2017
నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో సాహస యాత్ర చేసిన 80 ఏళ్ల బ్రూస్ మెక్ కాండ్లెస్స్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంట్ ధృవీకరించింది. 1984లో ఛాలెంజర్ స్పేస్ షటిల్లో ప్రయాణించిన బ్రూస్ అంతరిక్షంలో ఎలాంటి ఆధారం లేకుండా తేలియాడిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బోస్టన్లో జన్మించిన బ్రూస్ కాలిఫోర్నియాలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. నావల్ అకాడమీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పుచ్చుకున్నారు. 1984లో నాసా ఛాలెంజర్ ద్వారా అంతరిక్షంలో విహరించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







