విజయ్‌సేతుపతి కి అమితాబ్‌బచ్చన్ ఐకాన్ అవార్డు
- December 23, 2017
విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి... అమితాబ్‌బచ్చన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు గత 14వ తేదీ నుంచి చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం సాయంత్రం స్థానిక దేవి థియేటర్‌లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్ కరుణై మను గెలుచుకుంది. సురేశ్ చంగయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్‌ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నిర్మించింది.
ద్వితీయ ఉత్తమ చిత్రం – విక్రమ్‌వేదా గెలుచుకుంది. బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో అందించే అవార్డు విజయ్‌సేతుపతిని వరించింది. అదే విధంగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. కార్యక్రమంలో నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల