అబుధాబి లో ఘనంగా 'వనిత ఫామిలీ డే'

- December 23, 2017 , by Maagulf

అబుధాబి:అబుధాబి లోని ఖాలిడియా ఫ్యామిలీ పార్కులో  తెలుగు కళా  శ్రవంతి అనుబంధ   సంస్థ వనిత వారు నిర్వహించిన ఫ్యామిలీ ఫన్ డే తెలుగు కుటుంబాలు అందరు చాలా ఆనందంగా జరుపుకున్నారు. 
వనిత సంమ్మేస్తా 2014వ సంవత్సరంలో నెలకొల్పబడి పలు కార్యక్రమాలు నిర్వహించారు గతంలో కిచెన్ క్వీన్ , స్వీట్ సిక్సటీన్ , వనిత వయ్యారి భామ, సరదాగా కాసేపు, అనే పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి శుక్రవారం 22nd డిసెంబర్ న నిర్వహించిన ఫామిలీ ఫన్ డే కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొని చాలా ఆనందంగా గడిపారు, పిల్లలకి, మగవారికి, ఆడ వాళ్లకి, మరియూ కపుల్ గేమ్స్ కూడా నిర్వహించారు. ఉదయం అందరికి బ్రేక్ఫాస్ట్ తో మొదలు , మధ్యాన్నం భోజనం, సాయంత్రం పానీయం అందించారు. పాటల dumb charades లో అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటలలో పాల్గొన్న విజేతలకు అందరికి బహుమానాలు అందించారు. వనిత కార్య  బృందం మహిత బలుసు, రోజా చెరుకు, రాధికా దుగ్గిరాల , సుజనా వడ్డీ, యామిని భోగడపాటి, అర్చన చల్ల , నిరుపమ మెడపురెడ్డి కార్య్కర్మంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలియచేసారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com