నిర్మాత వేస్ట్‌ఫెలో..నన్ను తిరస్కరించాడు: సిద్ధార్థ్
- December 23, 2017
హైదరాబాద్: కథానాయకుడు నాని నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా 'అ!'. కాజల్, రెజీనా, నిత్యామేనన్, అవసరాల శ్రీనివాస్, ఈషా రెబ్బా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ చేపకు నాని వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాని శనివారం విడుదల చేశారు. 'నా తర్వాతి చిత్రంలో ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. కథ డిమాండ్ చేయడంతో ఈత నేర్చుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. దీన్ని చూసిన కథానాయకుడు సిద్ధార్థ్ స్పందిస్తూ.. 'ఈ సినిమా స్క్రిప్ట్, బృందం గురించి గొప్ప విషయాలు విన్నాను. తొందరగా విడుదల చేయి బ్రదరూ' అని నాని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'ఈ సినిమాలో మీరు ఏదైనా పాత్రను పోషిస్తున్నారా?' అని సిద్ధార్థ్‌ని ప్రశ్నించారు. దీంతో ఆయన నానిని ఆటపట్టిస్తూ పరోక్షంగా చురకలు వేశారు. 'నేనూ చేయాలి అనుకున్నా..నిర్మాత వేస్ట్‌ఫెలో. నన్ను తిరస్కరించాడు' అని బదులిచ్చారు. నాని, సిద్ధార్థ్ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఇటీవల విడుదలైన సిద్ధార్థ్ 'గృహం' సినిమా ప్రచార కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల