కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం

- December 23, 2017 , by Maagulf
కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ పేర్కొంది. ఈ ఘటన సౌత్‌ మాబెలాలో జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసినట్లు సివిల్‌ డిఫెన్స్‌ వెల్లడించింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని స్పష్టం చేసిన సివిల్‌ డిఫెన్స్‌, అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com