తండ్రి సూపర్ స్టార్ హీరో.. కానీ వెండి తెరపై విఫలమవుతున్న హీరో తనయుడు
- December 23, 2017
ఏ ఇండస్ట్రీలో అయినా వారసుల హవా మామూలే. వీరిలో సూపర్ స్టార్స్ వారసులకు రావడంతోనే ఓ స్ట్రాంగ్ బేస్ ఉంటుంది. దీంతో వారూ స్టార్స్ అయిపోతారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సాల్మన్ ఇలా వచ్చి తన టాలెంట్ తో తను ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు. కానీ ఈ విషయంలో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఫెయిల్ అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడంలో విఫలమయ్యాడు. అయినా అతను తన డ్రీమ్స్ ను చేజ్ చేస్తూనే ఉన్నాడు.. అందుకు ఆధి అనే మూవీ నిదర్శనం.
కొన్నాళ్ల క్రితం హీరోగా పరిచయం అయినా పెద్దగా సక్సెస్ కాలేదు ప్రణవ్ మోహన్ లాల్. దీంతో ఇక అతను రాడు అనుకున్నారు చాలామంది. లేటెస్ట్ గా ఆధి అనే మూవీతో మళ్లీ వస్తున్నాడు. ట్రైలర్ ఓ చోట తనే అంటాడు.. స్టిల్ చేజింగ్ ఇన్ డ్రీమ్స్ అని.. అది నిజమే అన్నట్టుగా ట్రైలర్ సాగుతుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే అతను తన కల నెరవేర్చుకునేలానే ఉన్నాడు. కానీ ఏమాటకామాటే.. దుల్కర్ తో పోలిస్తే లుక్స్ లోనే కాదు.. టాలెంట్ లో కూడా మనోడు చాలా దూరంలో ఉంటాడు. అందుకని అతను ఫ్యూచర్ అవుతాడో లేదో కానీ.. కనీసం స్టార్ గా ఎదగాలని మోహన్ లాల్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల