భారీ తుఫానుకి ఫిలిఫ్పీన్స్ అతలాకుతలం
- December 23, 2017
మనీలా: తుపాన్ ప్రభావంతో దక్షిణ ఫిలిఫ్పీన్స్ అతలాకుతలమైంది. టెంబిన్ తుఫాన్ కారణంగా 182 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. టెంబిన్ తుఫాన్ ధాటికి దక్షిణ ఫిలిఫ్పీన్స్ తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాలతో ఫిలిఫ్పీన్స్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహయక చర్యలను చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
టెంబిన్ తుఫాన్ ధాటికి 182 మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది నిరాశ్రయులయ్యారు. 153 మంది ఆచూకీ లేకుండా పోయింది.పెద్ద ఎత్తున మట్టి కొట్టుకొచ్చినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుందని ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు.అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కు పైగా పెను తుపానులు విరుచుకుపడుతుంటాయి. అయితే ఈ తుఫాన్ హెచ్చరికలను ప్రజలు సాధారణ తుఫాన్ మాదిరిగా భావించారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని ద్వీపాలకు జరిగే నష్టం తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోలేదని తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్‌లో రెండో అతి పెద్ద ద్వీపమైన మిన్‌డనావోలో మెరుపు వరద సంభవించింది. దీంతో అక్కడ నివసించే 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!