'నేల టిక్కెట్' గాడు మా రవితేజ

- December 23, 2017 , by Maagulf
'నేల టిక్కెట్' గాడు మా రవితేజ

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా కన్ఫాం అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో హిట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ మాస్ రాజాతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అసలైతే నాగార్జున సినిమా చేయాల్సి ఉన్నా ఆ సినిమా కథ సెట్ అవ్వలేదు.

ఫైనల్ గా రవితేజతో సినిమా ఫిక్స్ చేసుకున్న ఈ క్రేజీ డైరక్టర్ సినిమా టైటిల్ గా నేల టిక్కెట్ అని పెట్టబోతున్నారట. మాస్ రాజాకు పర్ఫెక్ట్ టైటిల్ గా వస్తున్న ఈ సినిమాపై టైటిల్ తో అంచనాలు పెంచేశారు. పక్కా మాస్ మసాలా సినిమాగా ఇది రాబోతుందని తెలుస్తుంది. ఇప్పుడంటే మల్టీప్లెక్స్ అని వచ్చాయి కాని ఒకప్పుడు టూరింగ్ టాకీస్ లో నేల టిక్కెట్ అంటే యమ క్రేజ్.

మాస్ రాయుళ్లకు నేల టిక్కెట్ తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. రాజా ది గ్రేట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం టచ్ చేసి చూడు సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. విక్రం సిరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు రవితేజ.

మొత్తానికి కళ్యాణ్ కృష్ణతో క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ. యువ హీరోలు సత్తా చాటుతున్న తరుణంలో స్టార్ గా మాస్ రాజా మళ్లీ తన క్రేజ్ ఏంటో చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి అంచనాలను మించి రాబోతున్న సినిమాల ఫలితాలు ఉంటాయో లేదో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com