ప్రఖ్యాత గాయకుడు మొహమ్మద్ రఫీ స్పెషల్..!
- December 24, 2017
సినీ సంగీత అభిమానులకు సుపరిచితమైన అలనాటి ప్రఖ్యాత గాయకుడు మొహమ్మద్ రఫీ. కేవళం ఉత్తర భారతదేశంలోనే కాకా దక్షిణాదిలో కూడా అయన పాటలు అమోఘం. ఇవాళ ఆ మహానీయుడి మరణం. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ హిందీ, ఉర్దూ, మరాఠీ మరియు తెలుగు భాషలలో కలుపుకుని మొత్తం 17 భాషల్లో తన గానంతో అందరిని మెప్పించాడు.. దేశం గర్వించదగ్గ గాయకుల్లో ఒకరిగా గుర్తింపుతెచ్చుకున్నారు..
ఒకానొక సమయంలో అంటే 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ కాలమనే చెప్పాలి. ఆరోజుల్లో రఫీ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ ల గాయక జోడీ, బాలీవుడ్ లో చరిత్రలో కొత్త ఒరవడిని సృష్టించింది. అంతేకాదు కేవలం రఫీ పాటల కోసమే సినీ ప్రియుల థియేటర్లకు వస్తారంటే అతియోశక్తి కాదు. అయన స్వరాన్ని అందించిన వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. మొహమ్మద్ రఫీ పాటలతోనే నటుడు రాజేంద్రకుమార్ సిల్వర్ జూబ్లీ హీరో అయ్యారని ఇప్పటికి చెప్పుకుంటారు.
ఇంతటి మహా గాయకుడూ 1924 లో పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ పూర్ జన్మించారు. అయన తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ, క్లాసికల్ సంగీతంలో ప్రావిణ్యం పొందిన ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్, పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు ఫిరోజ్ నిజామి ల వద్ద పాటలు పాడటం నేర్చుకున్నాడు. రఫీకి పదమూడేళ్ల వయసులో ఒక రోజు తన మేన మామ అయిన హమీద్ తో, గాయకుడు కె.ఎల్. సెహ్ గల్ గానకచేరి చూడడానికి వెళ్లి అవకాశం రావడంతో అయన ముందే పాడారు దీంతో పక్కనే ఉన్న శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) గుల్ బలోచ్లో జీనత్ బేగం తోడుగా పాడనిచ్చాడు.
ఇటు మొదటగా తెలుగులో అలనాటి నటుడు జగ్గయ్య నటించిన సినిమాలో గానానందించారు. ఆ తరువాత భక్త రామదాసు చిత్రంలో గుమ్మడికి నేపథ్యగానం చేశారు. ఇక తెలుగువారి ఆరాధ్యదైవంగా భావించే ఎన్.టి.రామారావు కు మంచి పాటలే పాడి మెప్పించారు. తెలుగులో భలే తమ్ముడు, తల్లా.. పెళ్ళామా, రామ్ రహీమ్, ఆరాధన, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్ సలీం అనార్కలి. వంటి చిత్రాలకు తన గాయకను అందించారు.. సినీ సంగీతలోకానికి తన గానంతో యావత్ భారతావని దృష్టిని ఆకర్షించిన మహమ్మద్ రఫీ 1980 డిసెంబర్ 24 మరణం చెందారు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల