న్యూజిలాండ్ కార్ ప్రమాదంలో హైదరాబాదీ మృతి
- December 24, 2017
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సయీద్ ఫర్హాద్ మహమూద్ అనే 29 ఏళ్ళ యువకుడు దుర్మరణం చెందాడు. క్యాబ్ డ్రైవరుగా పని చేస్తున్న సయీద్ వాహనాన్ని మరో కారు అతి పక్కనుంచి ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరు వ్యక్తులూ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. వారు కారును వదిలి పరారయ్యారు. అయితే వీరిలో ఒకరిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఫర్హాద్ మృతితో న్యూజిలాండ్ లో అతని భార్య, ఆరు నెలల వయసున్న కుమారుడు దిక్కులేనివారయ్యారు. ఫర్హాద్ మృత దేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల