కుటుంబసభ్యులతో కలిసి మక్కాను సందర్శించిన నటుడు అలీ
- December 24, 2017
తన కామెడీ తో ప్రేక్షకులను అలరించే అలీ..తాజాగా మక్కా ను దర్శించుకున్నారు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే పవిత్ర స్థలం మక్కా. తాజాగా ఆలీ తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లారు. సంప్రదాయ దుస్తుల్లో మక్కాను సందర్శించి.. అక్కడే తన కొడుకుతో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్ తెగ చక్కర్లు కొడుతుంది. ఎప్పుడు నవ్వు తో కనిపించే అలీ ఇందులో సీరియస్ కనిపించడం జరిగింది.
మొన్న జరిగిన అజ్ఞాత వాసి చిత్ర ఆడియో కు అలీ రాకపోవడం కూడా ఇదే కారణం..అలీ ఫ్యామిలీ తో కలిసి మక్కా వెళ్లడం వల్లనే ఫంక్షన్ కు రాలేకపోయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ , అలీ కాంబినేషన్ లో చాల సినిమాలు వచ్చాయి. అసలు అలీ లేకుండా సినిమా చేయడం నాకు ఇష్టం ఉండదని పవన్ చెప్పిన సందర్బాలు ఉన్నాయి. ఇక అజ్ఞాతవాసి లో మాత్రం అలీ నటించినలేదు. ఆయనకు సెట్ ఆయె రోల్ లేకపోవడం తో ఆయనను తీసుకోలేదట త్రివిక్రమ్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల