తలాల్ ను విడిపించాలనంటే భారీగా జరిమానా చెల్లించాలి

- December 24, 2017 , by Maagulf
తలాల్ ను విడిపించాలనంటే భారీగా జరిమానా చెల్లించాలి

రియాద్:ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడుగా పేరొందిన అల్ వాలీద్ బిన్ తలాల్‌ను విడిపించేందుకు సౌదీ ప్రభుత్వం 6 బిలియన్ డాలర్లను కోరుతోంది. ప్రపంచంలోని పలు దేశాలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్న తలాల్ ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు.

ఈ ఏడాది నవంబర్ 5న అల్ వాలిద్ బిన్ తలాల్ అరెస్ట్ అయ్యారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసింది. అవినీతి నిర్మూలనను కారణంగా చూపుతూ వాలిద్ బిన్ తలాల్‌తో పాటు సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్ అరెస్ట్ చేయించారు.

ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న తలాల్ మాత్రం జైలు నుండి బయట పడేందుకు ప్రభుత్వం విధించిన జరిమానాను చెల్లించడమే మార్గంగా ఉంది. ఈ జరిమానాను చెల్లిస్తేనే ఆయనను జైలు నుండి విడుదల చేస్తారు.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకడుగా అల్ వాలీద్ బిన్ తలాల్‌ కు పేరుంది. అయితే ఆయన ప్రస్తుతం సౌదీ జైల్లో మగ్గుతున్నాడు. ఆయనను జైలు నుండి విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. అయితే సుమారు 6 బిలియన్ డాలర్ల జరిమానాను చెల్లిస్తేనే జైలు నుండి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్టు ఆ పత్రిక ప్రకటించింది.
 
ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్‌కు వ్యాపారాలున్నాయి. అంతేకాదు పలు దేశాల ప్రభుత్వాలతో కూడ ఆయనకు సత్సంబంధాలున్నాయి. అయితే సౌదీ ప్రభుత్వం తలాల్ ను అరెస్ట్ చేసినప్పటీ ఈ పలుకుబడి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సౌదీ ప్రభుత్వం చెప్పినట్టుగా జరిమానాను చెల్లిస్తేనే ఆయన జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. 

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో అల్ వాలీద్ బిన్ తలాల్‌ ఒకరు. ఆయన ఆస్తి సుమారు 16 బిలియన్ డాలర్లు. ఇండియా కరెన్సీలో లక్ష కోట్లకు పైగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల్లో తలాల్ వ్యాపార సామ్యాజ్యం విస్తరించింది.

అనేకమంది యువరాజులను విడుదల చేయించేందుకు భారీ జరిమానాలను చెల్లించారు. కానీ తలాల్‌ను విడిపించేందుకు ఎవరూ ముందుకురాలేదు. తలాల్‌ను విడిపించాలంటే పెద్ద మొత్తంలో జరిమానాను చెల్లించాల్సి రావడమే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆ కథనంలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com