ప్యాంటు వెనుక జేబులో పర్సులు ఉంచవద్దు, షార్జా పోలీసుల హెచ్చరిక

- December 24, 2017 , by Maagulf
ప్యాంటు వెనుక జేబులో పర్సులు ఉంచవద్దు, షార్జా పోలీసుల హెచ్చరిక

షార్జా:" మీ ప్యాంట్ల వెనుక జేబులో పర్సులను ఉంచవద్దు. అలాగే  ఏ టి ఎం లేదా బ్యాంకు నుంచి డబ్బు తీసుకునేటప్పుడు మీ సమీపంలో ఎవరైనా అపరిచుతులు ఆడ వారైనా మగవారైనా వారి ముందు ఎటువంటి నగదు ప్రదర్శన చేయరాదని..అలాగే తెలియనివారెవరైనా మీ కారుని క్షణాలలో మరమ్మత్తు చేస్తానని నమ్మబలికినపుడు అస్సలు నమ్మరాదని షార్జా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తున్నారు. అలాగే ఎవరైనా సమీపం నుండి ఉమ్మి వేయడం లేదా ముక్కు చీది ఆ జలుబుని మీ దుస్తుల మీద రాయడం జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలి..ఏమాత్రం పరధ్యానంగా ఉండవద్దు. మీరు వారి వంక చూసిన మరుక్షణమే    మిమ్మలిని వారు దోచుకోవచ్చు. "ఇవన్నీ  షార్జా పోలీస్  దొంగతనాల పట్ల అవగాహన కల్గించడానికి తమ ప్రచారంలోని కొన్ని హెచ్చరికలు, ' అప్రమత్తంగా ఉండండి - దొంగతనంకు అవకాశం ఇవ్వకండి  ', ఎమిరేట్స్ పరిధిలో ఈ తరహా దొంగతనాలను నివారించడాని విస్తృత తనిఖీ షార్జా పోలీసులు ప్రారంభించారు.

షార్జా పోలీస్ క్రిమినల్ దర్యాప్తు విభాగం డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీం ముసాబా అల్ అజిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ యుఎఇని భద్రతను పెంచి.. రక్షణ చర్యలను పెంపొందించేందుకు ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ దృష్టిని సారించిందని అందులో భాగంగా ఈ తనిఖీ ప్రచారంను అమలు చేయాలని పోలీసుల నిబద్ధతలో ఈ ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. షార్జా ప్రపంచంలోనే  ఒక భద్రమైన దేశం. ఇది పోలీసు మరియు సమాజానికి మధ్య బంధాన్ని మరియు విశ్వాసాన్ని బలపర్చడానికి ఈ ప్రచారం ఉద్దేశించబడింది. నేరాలను నిరోధించే ముందు జాగ్రత్త చర్యలను ప్రజలకు తెలియచేయడానికి ఇదో చక్కని ఒక మార్గం అని అన్నారు.. "ప్రచారం దొంగతనాల నుండి వారి ఆస్తిని రక్షించడానికి నివారణ చర్యలు తీసుకోవటానికి నివాసితులను అప్రమత్తం చేస్తూ అజైల్ ప్రచారం వివిధ అవగాహన చర్యలు, మూడు భాషలలో ప్రజలకు బ్రోచర్లను పంపిణీ చేయడంతో సహా - అరబిక్, ఇంగ్లీష్ మరియు ఉర్దూ - బ్యాంకులు మరియు ఎటిఎమ్ అవుట్ లెట్స్ తో పాటు అనుమానాస్పద కార్యకలాపాలు ఎక్కడైనా  జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించడానికి ప్రజాప్రతినిధిని ప్రోత్సహిస్తుంది షార్జా నివాసితులు 999 మరియు 901 అత్యవసర పరిస్థితులకు మరియు 065943210 కు నేరాలను నివేదించడానికి అక్రమ కార్యకలాపాలు గూర్చి సమాచారం ఇవ్వవచ్చని ఆయన ప్రజలకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com