'టీ20' సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- December 24, 2017
ముంబై: వరుస సిరీస్ విజయాలతో ముగిసిన 2017 ముంబయి: భారత్‌కు దిగ్విజయం. శ్రీలంకకు మరో పరాభవం. ఈ ఏడాది వరుసగా అన్ని సిరీస్‌లనూ కైవసం చేసుకున్న టీమిండియా 2017ను ఘనంగా ముగించింది. వాంఖడే వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టు నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది.3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. టీ20 ఫార్మాట్లో రెండో ర్యాంకులో నిలిచింది. పాండే, శ్రేయస్ పోరాటం ఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. 17 పరుగులకే లోకేశ్ రాహుల్ (4) ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (30; 32 బంతుల్లో 1×4, 1×6)తో కలిసి సారథి రోహిత్ శర్మ (27; 20 బంతుల్లో 4×4, 1×6) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మంచు ప్రభావం, పిచ్ మందకొడిగా మారడంతో భారత్ వేగంగా పరుగులు చేయడం కష్టమైంది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద రోహిత్‌ను శనక ఔట్ చేశాడు. ఈ దశలో మనీశ్‌పాండే (32; 29 బంతుల్లో 4×4) చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వరుస బౌండరీలు బాదేశాడు.
అంతకు ముందు శ్రేయస్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 99 వద్ద పాండ్య (4), 108 వద్ద పాండే వెంటవెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివర్లో దినేశ్ కార్తీక్ (18 నాటౌట్; 12 బంతుల్లో 1×6), ఎంఎస్ ధోనీ (16 నాటౌట్; 10 బంతుల్లో 2×4) జట్టుకు విజయం అందించారు. శ్రీలంక బౌలర్లలో చమీరా, శనక తలో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత బౌలర్లు భళా అంతకు ముందు శ్రీలంక తేలిపోయింది! ఏడు వికెట్లు నష్టపోయి ఆతిథ్య జట్టు ముందు 135 పరుగుల లక్ష్యం ఉంచింది. భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. లంక జట్టులో అసేల గుణరత్నె (36; 37 బంతుల్లో 3×4) టాప్ స్కోరర్.
సమర విక్రమ (21; 17 బంతుల్లో 3×4), దసున్ శనక (29 నాటౌట్; 24 బంతుల్లో 2×6) రాణించారు. ఆదిలోనే దెబ్బ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకను బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. జయదేవ్ ఉన్కదత్ (2/15), సుందర్ (2/11) కలిసి 18 పరుగులకే డిక్వెలా (1), కుశాల్ పెరీరా (4), ఉపుల్ తరంగ (11)ను పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత సమర విక్రమ (21), అసేల గుణరత్నె (36) కాసేపు నిలకడగా ఆడారు. ఆచితూచి ఆడుతూనే చక్కని షాట్లు కొట్టారు.
దీంతో ఆ జట్టు స్కోరు బోర్డు కాస్త కదిలింది. 72/5తో ఫర్వాలేదనిపించింది. సమర విక్రమ, గుణరత్నెను పాండ్య (2/25) ఔట్ చేయడంతో లంక మళ్లీ తడబడింది. ఈ క్రమంలో తిసారా పెరీరా (11)ను హైదరాబాదీ కుర్రాడు సిరాజ్ పెవిలియన్ పంపించాడు.
చివర్లో దసున్ శనక (29 నాటౌట్) రెండు సిక్సర్లు బాది జట్టు స్కోరును 135కు చేర్చాడు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







