ప్రపంచంలోనే పొడవైన గాజు వంతెన ప్రారంభం
- December 24, 2017
ప్రపంచంలోనే అత్యధిక జనాభ గల చైనా సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకోవడంలో కూడా ముందుంటుంది. చైనాలో గాజుపలకల వంతెన ఆదివారం ప్రారంభమైంది. హెబీ ప్రాంతంలోని షిజియాజుయాంగ్‌లో రెండు మీటర్ల వెడల్పు, 448 మీటర్ల పొడవైన గాజు వంతెనను నిర్మించారు. ఈ వంతెన ప్రపంచంలోనే పొడవైన వంతెన. ఈ గాజు వంతెన నిర్మాణం కోసం 1077 గాజు పారదర్శక పలకలను ఉపయోగించారు. ఈ పలక ఒక్కొక్కటి 4 సెంమీ మందం ఉంటుంది. ఒకేసారి 2000 మంది ఎక్కే సామర్థ్యం కలిగిన ఈ గాజు వంతెన పర్యాటకులు నడుస్తన్న సమయంలో కొంచెం ఊగుతూ ఉండేలా నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ వంతెన పై నడవడం ధైరవంతులతోనే అవుతుందని, దానిపై నడుస్తుంటే వెన్నులో వణుకుపుడుతుందని ఈ వంతెన పై 500 మందికి ఎక్కే అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ ఇన్‌ఛార్జీ డైరెక్టర్ లియూ కికి తెలిపారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!