సౌదీలో వరదలు : 12 కు పెరిగిన మృతుల సంఖ్య
- November 18, 2015
పశ్చిమ సౌదీ అరేబియాలో సంభవించిన వరదల వల్ల కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 641 మందిని కొట్టుకుపోకుండా కాపాడామని, 894 మందికి వసతి కల్పించామని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటలలో, వరదలో చిక్కుకున్న తమను కాపాడమని 3,823 సందేశాలను అందుకున్నామని, రక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసామని కూడా వారు తెలిపారు. అల్ మదీనా లో అత్యధికంగా 22 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా, అల్ టారిఫ్, అల్ షిఫా, అల్ హయా, అల్ సఈల్ మరియు అల్ కబీర్ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వాయువ్య సౌదీ అరేబియా లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా మూడవ రోజు కూడా విశ్వ విద్యాలయాలు మూసివేయబడ్డాయి.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









