రేపు గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారం
- December 25, 2017
గుజరాత్లో వరుసగా ఆరోసారి విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ మంగళవారం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. గాంధీనగర్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉపముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశమున్నట్లు ఆ రాష్ట్ర గుజరాత్ అధ్యక్షుడు జితు వఘానీ తెలిపారు. అంతేగాక.. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా ప్రస్తుత సీఎం రూపానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఈ నెల 23న భాజపా రాష్ట్ర నేతలు గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్ కూడా ఆమోదించారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినప్పటికీ..
ఆశించిన మెజార్టీ దక్కించుకోలేకపోయింది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో భాజపా 99 సీట్లు సాధించింది.ఒక స్వతంత్ర ఎమ్మెల్యే భాజపాకు మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్కు 77 సీట్లు రాగా.. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ఆ పార్టీ సంఖ్య 80కి చేరింది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







