న్యూ ఇయర్ హాలీ డే: అబుదాబీలో ఫ్రీ పార్కింగ్
- December 25, 2017
అబుదాబీలో న్యూ ఇయర్ హాలీ డే సందర్భంగా వాహనదారులకు గుడ్ న్యూస్. న్యూ ఇయర్ హాలీ డే నేపథ్యంలో పార్కింగ్ ఉచితమని ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ - ఐటీసీ వెల్లడించింది. డిసెంబర్ 31 అర్థరాత్రి 12.00 గంటల నుంచి మంగళవారం, జనవరి 2 ఉదయం 7.59 నిమిషాల వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఐటిసి పేర్కొంది. వాహనదారులు నిషేధిత ప్రాంతాల్లో వాహనాల్ని నిలపరాదనీ, ట్రాఫిక్ ఫ్లో ఆపివేసేలా వాహనాలు నిలపవద్దని ఐటిసి సూచించింది. రెసిడెంట్ పార్కింగ్ బేస్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు వాహనాల్ని పార్కింగ్ చేయకూడదు. బస్ సర్వీసులు యధాతథంగా నడుస్తాయనీ, సాయంత్రం సర్వీసులు అబుదాబీ - అల్ అయిన్ మధ్య మాత్రం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తాయని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడుస్తాయి. ప్రతి 15 నిమిషాలకు ఓ బస్ అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







