మనం సైతం సంస్థకు తన ఆస్థిలో కొంత వాటా ఇవ్వనున్న రాజేంద్రప్రసాద్

- December 25, 2017 , by Maagulf
మనం సైతం సంస్థకు తన ఆస్థిలో కొంత వాటా ఇవ్వనున్న రాజేంద్రప్రసాద్

నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా హాస్య నటుడు.. నిర్మాత, సంగీత దర్శకుడు.. హాస్య రస ప్రధాన చిత్రాల్లో ఎక్కువగా నటించిన రాజేంద్ర ప్రసాద్.. పలు సందేశాత్మక చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. నటనలో ప్రతిభ కనబరిచి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఎన్నో గోల్డ్ మేడల్స్ ను అందుకొన్న రాజేంద్ర ప్రసాద్.. టాలీవుడ్ లో హాస్యనటుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి.. వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా కష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది "మనం సైతం" చేపట్టిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు వారెన్ బఫెట్ తన సంపాదనలో ముప్పాతిక వంతు సహాయ కార్యక్రమాలకు ఇస్తున్నాడు. బిల్ గేట్స్ ఛారిటీలు చేస్తున్నాడు. మనం సైతం లాంటి సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ కు వాళ్లకు పెద్ద తేడా లేదు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ కు ఉన్నంత డబ్బుంటే కిరణ్ కూడా ఇచ్చేవారు. ఇంకా ఎక్కువ సేవ చేసేవారు. వీళ్లకు డబ్బు లేకున్నా గొప్ప మనసుంది. కిరణ్ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఆయన మనస్తత్వానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఊహించాను. మనం సైతం లో ప్రతి సభ్యుడు గొప్పవాడే. నా ఆస్తిలో కొంత వాటా 'మనం సైతం' సంస్థకు ఇవ్వాలనుకుంటున్నాను అని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com