హైదరాబాదీకి ఒమాన్ దేశ భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన వైనం
- December 25, 2017
హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన వివాహితకు ఒమన్ దేశానికి చెందిన భర్త ఫోన్ ద్వారా తలాఖ్ ఇచ్చిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఎర్రకుంటకు చెందిన గౌసియాబేగంను ఒమన్ దేశానికి చెందిన జహ్రాన్ హమీద్ అల్ రాజి 2008 ఆగస్టు 11వతేదీన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో భార్య గౌసియాకు ఇల్లు నిర్మించి ఇచ్చి పదిలక్షల రూపాయల నగదు ఇస్తానని హామి ఇచ్చాడు. పెళ్లి అనంతరం నెలానెలా డబ్బు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి పోతుండే జహ్రాన్ ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి తలాఖ్ చెప్పి ఫోన్ కట్ చేశాడని గౌసియా బేగం దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు ఫిర్యాదు చేసింది. తాను ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని గౌసియా కేంద్రమంత్రిని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







