దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
- December 26, 2017
12 గంటల సూపర్ సేల్‌తో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. జనవరి 28 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఈ దుబాయ్ ఫెస్టివల్లో సందర్శకులు 1 మిలియన్ దిర్హామ్ విలువైన బహుమతుల్ని రఫాలే డ్రాలలో గెలుపొందే అవకాశం ఉంది. 12 గంటల సూపర్ సేల్ విషయానికి వస్తే, డిసెంబర్ 26 అర్థరాత్రి వరకు ఈ సేల్ కొనసాగుతుంది. మజిద్ అల్ ఫుత్తైమ్ షాపింగ్ మాల్స్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. షాపర్స్ కనీసంగా 20 శాతం, గరిష్టంగా 90 శాతం డిస్కౌంట్ ఈ మాల్స్‌లో పొందే అవకాశం ఉంది. మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, సిటీ సెంటర్స్‌లోనూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 200 దిర్హామ్‌లు ఖర్చు చేసే షాపర్స్, 50,000 దిర్హామ్‌ల ప్రైజ్ గెల్చుకునే ఛాన్స్ ఉంది. మంగళవారం అర్థరాత్రి సిటీ సెంటర్ మిర్దిఫ్‌లో విజేతల్ని ప్రకటిస్తారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నేపథ్యంలో న్యూ ఇయర్ ఈవ్ స్పెషల్ షోస్ డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఫైర్వర్క్స్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానున్నాయి. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ పాస్‌లు 399 దిర్హామ్‌ల నుంచి ప్రారంభం కానుండగా, వీటితో రెస్టారెంట్స్‌లో 65 శాతం డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







