మాలిక్యులస్‌ ఫైల్స్‌: యూఏఈ మినిస్ట్రీ హెచ్చరిక

- December 26, 2017 , by Maagulf
మాలిక్యులస్‌ ఫైల్స్‌: యూఏఈ మినిస్ట్రీ హెచ్చరిక

టెలికమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ), వాట్సాప్‌ లేదా ఇ-మెయిల్‌ ద్వారా మాలిక్యులస్‌ పీడీఎఫ్‌ ఫైల్స్‌ని పంపడం నేరమని ప్రకటించింది. ఈ తరహా చర్యల ద్వారా ఇతరుల ఫోన్లలోని డేటాని తస్కరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని టిఆర్‌ఎ పేర్కొంది. టిఆర్‌ఎ - నేషనల్‌ పిసి ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌, గడచిన పది నెలల్లో ఈ తరహా ఎటాక్స్‌ని 15 వరకు ఎదుర్కొన్నామనీ, ఈ సైబర్‌ ఎటాక్స్‌ ప్రధానంగా ప్రభుత్వ మరియు సెమీ గవర్నమెంట్‌ బాడీస్‌కి చెందిన కంప్యూటర్స్‌ని టార్గెట్‌ చేస్తున్నాయనీ, ప్రైవేట్‌ సెక్టార్‌కి కూడా వీటి కారణంగా ముప్పు పొంచి ఉందని అధికారులు వెల్లడించారు. ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ని వినియోగిస్తున్నవారు, ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, తెలిసిగానీ తెలియకగానీ ఫైల్స్‌ని గ్రూప్స్‌లో షేర్‌ చేయరాదని టిఆర్‌ఎ సూచించింది. యాంటీ సెక్యూరిటీ వైరస్‌ని పీడీఎఫ్‌ ఫైల్స్‌లో నింపి, వాటి ద్వారా ఇతర కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌లోని డేటాని తస్కరిస్తున్నారు సైబర్‌ క్రిమినల్స్‌. తద్వారా ఆయా కంప్యూటర్స్‌ని హాకర్స్‌ తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com