యెమెన్‌లో సంకీర్ణ సేనల వైమానిక దాడులు, సుమారు 50 మంది మృతి

- December 26, 2017 , by Maagulf
యెమెన్‌లో సంకీర్ణ సేనల వైమానిక దాడులు, సుమారు 50 మంది మృతి

యెమెన్‌లో హౌతీ రెబల్స్‌పై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు అల్‌జజీరా టీవీ ఛానల్‌ తన వార్తా కథనంలో వెల్లడించింది. ఆదివారం నాడు జరిగిన 51 వైమానిక దాడుల్లో కనీసం 11 మంది చిన్నారులతో సహా మొత్తం 48 మంది పౌరులు మృతి చెందినట్లు హౌతీల ఆధ్వర్యంలోని సబా వార్తా సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు సనా నగరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులతో సహా మరో 11 మంది మరణించారని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని వివరించింది. సనా నగరం పశ్చిమ ప్రాంతంలో నివశిస్తున్న హౌతీ స్థానిక నేత మహ్మద్‌ అల్‌ రైమీ నివాసం లక్ష్యంగా సంకీర్ణ సేనలు ఈ దాడులు చేశాయని హౌతీ దళాలకు చెందిన అబ్దుల్‌ మాలిక్‌ అల్‌ ఫాదిల్‌ అనే కార్యకర్త వివరించాడు. సౌదీ అరేబియా యుద్ధ విమానాలు హౌతీల ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ భవనంపై కూడా దాడులు చేశాయని మరో అధికారి వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ సంకీర్ణ సేనలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 136 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల కమిటీ ప్రతినిధి రూపర్ట్‌ కోల్విల్లీ వివరించారు. యెమెన్‌లో ప్రభుత్వ సేనలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య 2014 నుండి అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com