'టిసిఎఫ్-దోహా' వారి క్రిస్మస్ సెలెబ్రేషన్స్

- December 26, 2017 , by Maagulf

ఖతార్: తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో దోహాలో ఘనంగా  క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. పాస్టర్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు నలుమూలల నుండి దాదాపు 5 వేలకు మందికి పైబడే  భారీ సంఖ్యలో క్రైస్తవ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో ముందుగా….. క్రిస్మస్ పర్వదిన విశిష్టత, ఏసు జన్మ విశిష్టతను కొనియాడుతూ క్రిస్మస్ ఆరాధన గీతాలను ఆలపించారు , పాస్టర్ డాక్టర్ ఓగురి బుల్లబ్బాయి ప్రసంగిస్తూ  క్రీస్తు పుట్టుక గూర్చి, గల్ఫ్ దేశాలలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న భారతీయులందరు క్షేమంగా ఉండాలని దేవాది దేవుడిని ప్రార్ధించారు. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి ఏసుక్రీస్తు పునఃజన్మించారన్నారు. మానవత్వమే ప్రభువు అభిమతమని, అందుకే ఆయన చూపిన మార్గం అనుసరణీయమన్నారు. శాంతి, కరుణ, ప్రేమ ప్రభువు బోధనలన్నారు. వాటి స్థాపనకై దైవ కుమారుడిగా ఏసయ్య ఈ భూమి మీదకు 2017  ఏళ్ళ క్రితం వచ్చాడన్నారు. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. ప్రతీ మానవుడు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను అచరించినప్పుడే సమాజంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయన్నారు. సమసమాజ స్థాపనే ప్రతి మానవుని అభిమతం కావాలన్నారు. కుల మతాల కంటే మానవత్వం చాలా గొప్పదని, మనమంతా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ మన మానవత్వాన్ని ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రత్యేక క్రిస్మస్ సందేశం ఇచ్చి వచ్చే సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ఇంకా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపేరు.అనంతరం సహాయ పాస్టర్ జోసెఫ్ , ఇతర పాస్టర్లు, కార్యదర్శి ఈదా సంజీవరావు, కోశాధికారి విల్సన్ బాబు ,ఆదిదేల కుమార్ రత్నం తదితర పెద్దలు  క్రిస్మస్ కేక్ కట్ చేసి  ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, శాంటాక్లాజ్ వేషధారణతో ఈ వేడుకలోఅతిధులందరిని పలకరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు పిల్లలకు బహుమతులు పంచుతూ సందడి చేశాడు, సండే స్కూల్ చిన్నారులు ఏసుక్రీస్తు జన్మ దినోత్సవ అపురూప ఘట్టాన్ని కనులకు కట్టేలా లఘు నాటికలు క్రిస్మస్ పాటలు ఎంతో ఉత్సాహంగా పాటలు ఆలపించారు. వీరి ప్రదర్శన పెద్దలను విశేషంగాఅలరించాయి.దోహాలోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో క్రీస్తు పుట్టుక , దీనజనోద్ధరణకు మహాప్రభు మానవ జన్మ ఎత్తి అభాగ్యులను అక్కున చేర్చుకున్నారనే అంశం . పాపులను క్షమించి.. వారికి మోక్ష మార్గాన్ని  ప్రసాదించినట్లు తదితర బైబిల్ సత్యాలను చక్కని కధానాలుగా మలిచి  యువతీ యువకులతో చక్కని ప్రదర్శన చేయించిన నిర్వాహకుడు గోవాడ కిరణ్ ను పలువురి అభినందనలు పొందారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com