దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా లలో దాడులు చేస్తాం : ఆల్‌ఖైదా

- December 27, 2017 , by Maagulf
దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా లలో దాడులు చేస్తాం : ఆల్‌ఖైదా

ఆల్‌ఖైదా సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. కశ్మీర్‌ను కాపాడుకునేందుకు దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో దాడులు చేయాల్సి వస్తుందని ఆల్‌ఖైదా నేత ఉసామా మెహ్మూద్‌ హెచ్చరించాడు. ఈ దాడుల్లో భారతదేశానికి చెందిన ముస్లింలు అందరూ పాల్గొని కశ్మీరీలకు మద్దతుగా నిలవాలని.. అప్పుడే జిహాదీ ఉద్యమం బలపడుతుందని పేర్కొన్నాడు. 2015లోనూ ఆల్‌ఖైదా ఓ వీడియో విడుదల చేసి ముస్లింలకు ప్రధాని నరేంద్రమోదీ శత్రువని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో దేశంలోని పలు నగరాల్లో హై అలర్ట్‌ ప్రకటించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com