రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా
- December 27, 2017
విద్యుదయస్కాంత తరంగాలు, పర్యావరణ సంబంధిత అంశాల పరిశోధనకు సంబంధించిన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను చైనా మంగళవారం విజయవంతంగగా ప్రయో గించింది. లాంగ్‌మార్చ్ రాకెట్ శ్రేణిలో జరిగిన ఈ ప్రయోగం 260వదని అదికార సిన్హువా వార్తాసంస్థ వెల్లడించింది. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి లాంగ్‌మార్చ్-2సి రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలను రోదసిలోకి పంపినట్లు సిన్హువా తన వార్తా కథనంలో పేర్కొంది. ఈ ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశించాయని, మొత్తమ్మీద ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని తెలిపింది. అయితే ఎన్ని ఉపగ్రహాలు ప్రయోగించారన్న విషయాన్ని సిన్హువా వెల్లడించలేదు. యోగాన్-30 ప్రాజెక్టుకు చెందిన మూడోబృం దంలోని ఈ ఉపగ్రహాలు విద్యుదయస్కాంత తరంగాలు, పర్యావరణ సంబంధిత అంశాలపై ప్రయోగాలు నిర్వహిస్తాయని తెలిపింది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







