నుగ్ర లో మద్యం కర్మాగారం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు 27 మద్యం పీపాలతో పట్టివేత
- December 27, 2017
కువైట్ : సారా పై సంపాదన మించింది లేదని ఓ ముగ్గురు ప్రవాస భారతీయులు ఏకంగా మధ్య కుటీర పరిశ్రమని స్థాపించారు.హవల్లి కమాండ్ నుండి భద్రతా సిబ్బంది నగ్రా ప్రాంతంలో ఒక స్థానిక మద్యం కర్మాగారాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీని నడుపుతున్న ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. " మా గల్ఫ్ డాట్ కామ్ " నివేదిక ప్రకారం, అధికారులు 27 పీపాలతో సహా నిషేధించిన మద్యం తయారీలో ఉపయోగించిన సామగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. హవాల్లీ సెక్యూరిటీ చీఫ్ అబిడేన్ అల్-అబిదీన్ మాట్లాడుతూ మద్యం తయారీదారుల ముగ్గురు ఈ కర్మాగారంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకొంది. దాంతో వీరిపై నిఘా పెట్టిన గూడాచారుల బృందం సమాచారం యొక్క ప్రామాణికతను నిర్ధారించేందుకు వారిపై నిఘా పెట్టింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి ఆ కర్మాగారం శోధన మరియు అరెస్ట్ వారెంట్ పొందిన అనంతరం అధికారులు తగిన సమయంలో ఏకకాలంలో అపార్టుమెంట్లు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన ముగ్గురు అనుమానితులను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ నిందితులు విచారణ సమయంలో తమ నేరం అంగీకరించారు, వారు తయారుచేసిన నిషిద్ధ మద్యం తమ వినియోగదారులకు పంపిణీ చేసినట్లు వారు ఒప్పుకొన్నారు. దీంతో వీరిని చట్టబద్దమైన చర్య కోసం సంబంధిత అధికారులను సూచించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







