నీటిని వెదజల్లే వాటర్ గన్ లను వేడుకలలో నిషేధించాలని కేబినెట్ కు కోర్టు ఆదేశం

- December 27, 2017 , by Maagulf
నీటిని వెదజల్లే వాటర్ గన్ లను వేడుకలలో నిషేధించాలని కేబినెట్ కు కోర్టు ఆదేశం

కువైట్: నీటి విలువ తెలియకపోవడంతో పలు సందర్భాలలో పెద్ద మొత్తంలో అమూల్యమైన జలం వృధా చేయబడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని వెదజల్లే వాటర్ గన్ లను వేడుకలలో నిషేధించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొంది.  నేషనల్ మరియు లిబరేషన్ వేడుకలలో వాటర్ గన్ ల వినియోగాన్ని నిషేధించాలనే కేబినెట్ నిర్ణయంపై అధికార పరిపాలన కోర్టు ఇటీవలే ఒక తీర్పును సైతం విడుదల చేసింది. స్థానిక వార్తాపత్రికల కధనం ప్రకారం తీర్పును స్పందనగా ప్రజల ఆసక్తి కోసం నిషేధాన్ని కోరుతూ న్యాయవాది మోనా అల్-అర్బాష్ దాఖలు చేసిన ఒక కేసుకి, జాతీయ వేడుకలు సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాది నీటి గాలన్లు వృధా అవుతున్నాయని నీటి కోసం పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తునట్లు పేర్కొన్నారు  - ఇప్పటికే సహజ నీటి వనరులు తగ్గిపోవడం ఎంతో ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. పర్యావరణ కారణాలను దృష్టిలో ఉంచుకొని   స్ప్రే నురుగును ఉపయోగించడాన్ని నిషేధించిన తరువాత జాతీయ ఉత్సవాల్లో నీటి తుపాకులు మరియు నీటి ఫిరంగులను ఉపయోగించడం ఇటీవలి సంవత్సరాలలో బాగా ప్రాచుర్యం పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com