షార్జా ట్రాఫిక్ ఫైన్స్: డిస్కౌంట్ పొడిగింపు ఫిబ్రవరి 28 వరకూ
- December 27, 2017
గత అక్టోబర్లో ట్రాఫిక్ జరీమానాలకు సంబంధించి ప్రకటించబడిన డిస్కౌంట్ గడువుని ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. షార్జా పోలీస్ మీడియా అండ్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, డిస్కౌంట్తో కూడిన జరీమానాల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన యాప్ లేదా పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ పోలీస్ సెంటర్స్, ట్రాఫిక్ విలేజ్ (తస్జీల్), సహారా మాల్ పోలీస్ సర్వీస్ సెంటర్లలో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. యూఏఈ నేషనల్ డే మరియు ఇయర్ ఆఫ్ గివింగ్లో భాగంగా అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ అండ్ లైసెన్స్ డిపార్ట్మెంట్స్తో కలిసి ట్రాఫిక్ జరీమానాల్ని 50 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీకి ముందు నమోదైన జరీమానాలకే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







