జయలలిత బయోపిక్ "తాయ్‌.. పురచ్చి తలైవి"..!

- December 27, 2017 , by Maagulf
జయలలిత బయోపిక్

సినీ పరిశ్రమలోనే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి జయకేతనం ఎగురవేసిన జయలలిత... మరణానంతరం నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నది. అమ్మగా.. విప్లవ నాయకిగా  తమిళ ప్రజల ప్రేమను పొందిన జయలలిత జీవితం వెండి తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అమ్మ బయోపిక్ గురించి బాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య భరద్వాజ్ మాట్లాడుతూ.. తాను ఓ పబ్లిక్ మీటింగ్ లో జయలలితగారిని కలిశా.. అప్పుడు ఆమె బయోపిక్ గురించి చెప్పాను.. ఈ విషయం పై తర్వాత మాట్లాడమని జయలలిత చెప్పారు.. కానీ ఆ తర్వాత మాట్లాడే అవకాశమే రాలేదు.. ఈ లోపు ఏవేవో జరిగిపోయాయి.. దీంతో అమ్మ బతికున్నప్పుడు రెడీ చేసిన స్క్రిప్ట్ లో మార్పులు చేసి.. తాజా స్క్రిప్ట్ తో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జయలలిత బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాం.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం.. ఈ సినిమా షూటింగ్ ను జనవరి లేదా ఫిబ్రవరిలో పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం..."తాయ్‌: పురట్చి తలైవి" అనే టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో ఎవరు కనిపించనున్నారో ఇప్పుడు చెప్పలేను అని అన్నారు.. అంతేకాదు..  "తాయ్‌: పురట్చి తలైవి" అంటే విప్లవ నాయకి అని అర్ధం అని కూడా ఆదిత్య భరద్వాజ్ చెప్పారు. కాగా ఇప్పటికే వివాదాల వర్మ "జయలలిత శశికళ" ల బయోపిక్ ను తెరకెకిస్తాను అని ప్రకటించిన సంగతి విధితమే..! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com