అభిమాని మరణాన్ని తట్టుకోలేక ఏడ్చిన కార్తీ...!!
- December 28, 2017
దక్షిణాదిలో హీరోల పట్ల అభిమానుల అభిమానం కాస్త ఎక్కువే.. ఇక తమ అభిమాన హీరోలకు అభిమాన సంఘాలు సర్వసాధారణం.. పాలాభిషేకం.. పుట్టిన రోజు సెలబ్రేషన్స్ తో తమ అభిమానం చాటుకొంటూనే ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే చేసే హడావిడి అంతా ఇంతాకాదు.. ఇక తమ అభిమాన హీరోని చూస్తే.. చాలు జన్మ ధన్యం అనుకొనే అభిమానులు ఎందరో.. కాగా తమ కోసం ప్రాణం ఇచ్చే అభిమానులను కంటికి రెప్పలా కాపాడుకొనే హీరోలు కూడా ఉన్నారు.. తాజాగా తన అభిమాని ప్రాణాలు పోగొట్టుకోవడం చూసి కోలీవుడ్ హీరో కార్తీ కన్నీరు పెట్టుకొన్నారు. వివరాల్లోకి వెళ్తే..
తిరువన్నామలై కార్తీ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ 27 ఏళ్ల జీవన్ కుమార్ రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే కార్తీ అక్కడకు చేరుకొన్నారు.. తన అభిమాని మృతి నివాళులు అర్పిస్తూ కార్తీ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు.. జీవన్ కుమార్ హీరో కార్తీ ని చాలా సార్లు కలిశాడట.. ఎంతో అభిమానం చాటుకొన్న జీవన్.. కార్తీకి వ్యక్తి గతంగా కూడా చేరువయ్యాడు.. తన అభిమానితో కార్తీ సినిమాల గురించి ముచ్చటించేవాడట.. అటువంటి వ్యక్తి తనకు దూరం అవ్వడంతో కార్తీ కన్నీరు పెట్టుకొన్నాడు.. పైగా జీవన్ కుమార్ కు మూడు నెలల క్రితమే పెళ్లిజరిగింది.. ఆ పెళ్ళికి కార్తీ హాజరయ్యాడు.. జీవన్ వైవాహిక జీవితంలో అడుగు పెట్టి మూడునాళ్ళ ముచ్చటగానే ముగిసింది. జీవన్ ప్రయాణిస్తున్న కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.. జీవన్ మృతి చెందాడు.. కాగా జీవన్ మృతితో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయింది. తాను జీవన్ కుటుంబానికి జీవన్ లేని లోటు తీర్చలేను కానీ.. అన్నీ విధాలా తన వంతుగా సపోర్టుగా ఉంటానని కార్తీ మాట ఇచ్చారట.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







