'టచ్‌ చేసి చూడు' ఫస్ట్‌లుక్‌ విడుదల

- December 28, 2017 , by Maagulf
'టచ్‌ చేసి చూడు' ఫస్ట్‌లుక్‌ విడుదల

మాస్‌మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం టచ్‌ చేసి చూడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఈరోజు విడుదలైంది. ఇందులో బోల్తాపడిన కారు వద్ద రవితేజ కళ్లజోడు పెట్టుకుని స్టైల్‌గా నడిచొస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లమలపు శ్రీనివాస్‌, వల్లభనేని వంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోపక్క రవితేజ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమాకి నేల టికెట్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో రవితేజకి జోడీగా మాళవిక శర్మ నటించనున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com