నాగచైతన్య కొత్త చిత్రం 'ధర్మాభాయ్‌'.!

- December 29, 2017 , by Maagulf
నాగచైతన్య కొత్త చిత్రం 'ధర్మాభాయ్‌'.!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'సవ్యసాచి' చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయన.. దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఓ చిత్రం చేయబోతున్నట్లుటాలీవుడ్‌ వర్గాల సమాచారం. అక్కినేని నాగార్జునతో 'ఢమరుకం' తెరకెక్కించారు శ్రీనివాస్‌రెడ్డి.


నాగచైతన్యతో ఆయన తీయబోయే చిత్రానికి 'ధర్మాభాయ్‌' అనే టైటిల్‌ను పరిలిస్తున్నారట. 'ఢమరుకం' చిత్ర రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథ రాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న 'సవ్యసాచి' చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. మాధవన్‌, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. జనవరి 4 నుంచి తర్వాతి షెడ్యూల్‌ మొదలుపెట్టనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com