మరోసారి మెగాస్టార్ పాట రీమేక్ తో రానున్న సాయి ధరమ్ తేజ్
- December 29, 2017
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లోని సూపర్‌హిట్ పాటలు రీమేక్‌గా వచ్చాయి. రామ్‌చరణ్ నటించిన 'మగధీర' చిత్రంలో 'బంగారుకోడిపెట్ట', 'రచ్చ'లో 'వానా వానా వెల్లువాయే', 'నాయక్'లో 'శుభలేక రాసుకున్నా..' పాటలు వచ్చాయి. అదేవిధంగా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రాల్లో 'గోలీమార్..', 'గువ్వ గోరింక', 'అందం హిందోళం' పాటల రీమేక్‌లు సందడి చేశాయి. ఇప్పుడు 1990లో చిరంజీవి నటించిన 'కొండవీటి దొంగ' చిత్రంలోని ఓ సూపర్ హిట్ పాటను ధరమ్ తేజ్ చిత్రంలో రీమేక్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 'జవాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధరమ్ తేజ్ ప్రస్తుతం వి.వి. వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో 'చమకు చమకు ఛాం..' పాటను రీమేక్ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో ధరమ్ తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







