జనవరి 26న రానున్న 'ఆచారి ఆమెరికా యాత్ర'.

- December 29, 2017 , by Maagulf
జనవరి 26న రానున్న 'ఆచారి ఆమెరికా యాత్ర'.

'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలను అందించిన హీరో విష్ణు మంచు, దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డిల కలయికలో వస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల కానుంది. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి, కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు;
ఇతర తారాగణం:
తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస్ రావు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, ప్రవీణ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావా, ఠాకూర్ అనూప్ సింగ్ 
సాంకేతిక వర్గం: 
రచయత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి 
ఛాయాగ్రాహకుడు: సిద్దార్థ్ 
ఎడిటింగ్: వర్మ 
సంగీతం: ఎస్ ఎస్ థమన్ 
మాటలు: డార్లింగ్ స్వామి 
ఆర్ట్ : కిరణ్ 
యాక్షన్ : కనాల్ కన్నన్ 
బ్యానర్ : పద్మజ పిక్చర్స్ 
సమర్పించు : ఎం ఎల్ కుమార్ చౌదరి 
నిర్మాతలు: కీర్తి చౌదరి , కిట్టు 
స్క్రీన్ప్లే , దర్శకత్వం : జి నాగేశ్వర్ రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com