శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో `జంబలకిడి పంబ`
- December 29, 2017
`గీతాంజలి`, `జయమ్ము నిశ్చయమ్మురా` వంటి వైవిధ్యమైన సబ్జెక్టులతో కథానాయకుడిగా రెండు ఘన విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. `జంబలకిడి పంబ` పేరుతో తాజా చిత్రం రూపొందనుంది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మాతలు.
నిర్మాతలు మాట్లాడుతూ ``డిసెంబర్ 29న, వైకుంఠ ఏకాదశి రోజున మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నాం. మార్చి 10 వరకు నిరవధికంగా షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. వెన్నెలకిశోర్ పాత్ర కూడా హైలైట్ గా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది`` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ```జంబలకిడి పంబ` ఎంత సూపర్‌హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి కేరక్టర్ చాలా బాగా కుదిరింది. ఒక వైపు వినోదాన్ని పండిస్తూనే, మరో వైపు డెప్త్ గా ఉండే పాత్రలో ఆయన కనిపిస్తారు. శ్రీనివాసరెడ్డి కెరీర్‌లో మరో కీలక చిత్రమవుతుంది`` అని అన్నారు.
సత్యం రాజేశ్, ధన్‌రాజ్, షకలక శంకర్, హరి తేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ (మను), నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్., సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల